త్రిగుణములు

6. త్రిగుణములు

త్రిగుణములు : 
ఇవి అన్యోన్య దాంపత్యమును అన్యోన్య సంశయమును గలవి. అన్యోన్య సంకలితములైఅన్యోన్య ఉపజీవితము గలవి. దుర్బోధము లైనవి. ఒక గుణము ప్రధానముగా వ్యక్తమైనప్పుడు మిగిలిన రెండు గుణములు అణగియుండును. తమోగుణము నియమితమైతే రజో గుణము సాగును. రజస్సు నియమితమైతే సత్వము సాగును. సత్వము అణిగినప్పుడు తమస్సు మొదలగును. ప్రతి వ్యవహారములోను గుణములు గుణములతో సంపర్కమవుతూ ఉండును. గుణములే వాసనల రూపమును క్షోభపెట్టి కాలానుగుణ్యముగా జీవుని అనుభవమునకు తీసుకొని వచ్చుచుండును. అపక్వవాసనలను పక్వానికి తెచ్చేవి గుణములే. క్షోభకు గురియైన వాసనలే ప్రారబ్ధ  అనుభవము నిచ్చుచున్నవి. త్రిగుణ రహితునికి సంచిత వాసనలు 
నిర్బీజమగును. క్షోభ లేనందున ప్రారబ్ధముండదు. అదే జన్మరాహిత్యము. త్రిగుణ రహితుడే పరబ్రహ్మము.

శుద్ధ సాత్వికములు : 
సత్వముసంతోషముఅహింసధైర్యముక్షమఆర్జవముసన్న్యాసముపరిత్యాగమువిజ్ఞానము మొదలగునవి సహజమై యుండుట శుద్ధ సత్వగుణము.

సత్వగుణ జనితములు : జపముదానముయజ్ఞముతపస్సు మొదలగునవి.

త్రిగుణ సామ్యము : శుభముశాశ్వతత్వము

త్రిగుణముల అవ్యక్తము : మోక్షము

త్రిగుణ రహితము : అచల పరిపూర్ణముపరమ పదము.

త్రిగుణ కర్తలు : 
అనాసక్త భావముతో కర్మలను చేసేవాడు సాత్విక కర్త. రాగముతో కర్మలు చేసేవాడు రాజసిక కర్త. స్మృతి భ్రష్టుడై యుక్తాయుక్త విచక్షణ లేకుండా కర్మలు చేసేవాడు తామసిక కర్త. కేవలము సర్వాంతర్యామిసర్వబాహ్యాంభ్యంతర స్వరూపుడగు పరమాత్మను ఉద్దేశించి కర్మలు చేసేవాడుమరియు ప్రతి కర్మను పరమాత్మారాధనగా చేసేవాడు గుణాతీతకర్త.

త్రిగుణ వాసములు : 
వనవాసము సాత్వికవాసము. గ్రామవాసము రాజసిక వాసము. జూదపాన గృహము తామసిక వాసము. దేవాలయములుఋష్యాశ్రమములుపుణ్య క్షేత్రములుహృదయ నివాసము - ఇవి గుణాతీత వాసములు.

త్రిగుణావస్థలు : 
సత్వగుణము ప్రవృద్ధమైనప్పుడు జాగ్రదవస్థ. రజోగుణము ప్రవృద్ధమైనప్పుడు స్వప్నావస్థ. తమోగుణము ప్రవృద్ధమైనప్పుడు సుషుప్త్యావస్థ. ఈ మూడు గుణములు క్షీణించినప్పుడు మూడు అవస్థలకు సాక్షియైఆత్మానుభవము పొందినప్పుడు తురీయావస్థ.

త్రిగుణ కర్మలు : 
సర్వాంతర్యామియగు పరమాత్మకు ప్రీతి కలిగించే ఉద్దేశ్యముతో ఫలాభిలాష లేకుండాసమర్పణ భావముతో అనుష్ఠింపబడే నిత్య నైమిత్తిక కర్మలు సాత్విక కర్మలు. లోక సంబంధమైన ఫలమును కోరి చేసే కర్మలు రాజసిక కర్మలు. సహజీవులను బాధిస్తూహింసిస్తూదంభ మత్సరములతో కూడిన కర్మలుఇతరులపై ఆధిపత్యమును చెలాయించే కర్మలు తామసిక కర్మలు. కర్తృత్వముభోక్తృత్వము లేకుండా జరిపే కర్మ సాధనములందు ఫలత్యాగముతోనుసర్వము బ్రహ్మరూపమని చేసే కర్మలు గుణాతీత కర్మలు.

త్రిగుణ శ్రద్ధలు : 
ఆధ్యాత్మిక మార్గము సూచించుచున్నబోధించుచున్న మార్గముఆశయముల పట్ల గల శ్రద్ధ సాత్విక శ్రద్ధనిర్మలమైనసున్నితమైనవిస్తారమైన బుద్ధితోశాస్త్రములఆత్మజ్ఞుల బాటలో నడుస్తూ దానిని పరిశీలిస్తూ ఉండుట సాత్విక శ్రద్ధ. ఏదేదో ముందు ముందు చేయవలసినది ఉన్నదని ఎంతెంత పొందుచున్నాడనే పరిశీలన రాజసిక శ్రద్ధ. అధర్మమే అతని ధర్మమని అవివేకముతో కూడిన భావన తామసిక శ్రద్ధ అనబడును. భక్తియొక్క ప్రవృద్ధియే ఆశయముగా కలిగిపరమాత్మను సేవించుటయందు గల శ్రద్ధ గుణాతీత శ్రద్ధ అనబడును.

త్రిగుణ జ్ఞానములు : 
దేహ భావననుగుణములను అధిగమించి దేహిని గురించిగుణిని గురించి ప్రవచించేనిర్వచించేతెలియజేసే జ్ఞానము సాత్విక జ్ఞానము. బంధ మోక్షములుసాధన పద్ధతుల గురించిన నిశ్చయ జ్ఞానమును కూడా సాత్విక జ్ఞానమందురు.
         దేహమునకుఇంద్రియాదులకువిషయములకు సంబంధించినలోక విశేషాదులకు సంబంధించిన జ్ఞానమును రాజసిక జ్ఞానము అందురు.
         పెత్తనముఆధిపత్యముఇతరులను లొంగదీసుకొనుటబాధించుటలోభత్వముల గురించిన జ్ఞానమునుఇంద్రియ  భోగములకు సంబంధించిన జ్ఞానమును తామసిక జ్ఞానము అందురు.
              జ్ఞానమే తానైన విజ్ఞానముస్వస్వరూపముప్రజ్ఞాన ఘనముచిత్‌ ఘనముఆనంద ఘనముఈ లక్షణములు గుణాతీత జ్ఞానము అనబడును. త్రిగుణముల వృద్ధికి సూచనలు : 
చిత్తము కలత చెందుచూచిత్‌ను పూర్తిగా ఏమరుస్తూ వుంటేసంకల్పాత్మకమైన మనస్సు బలహీనమై బద్ధకిస్తూ ఉంటేఅజ్ఞానమువిషాదము తెంపు లేకుండా ఉంటే - అది తమోగుణ వృద్ధికి సూచన.
         జీవుడు అనేక కర్మ వ్యవహారములందు ఆసక్తుడైవికృతుడైతేచిత్తము చంచలముగా ఉంటూ విక్షిప్తి చెందుతూ ఉంటే మనసు వ్యభిచరిస్తూ ఉంటేకర్మేంద్రియములు అవిరామముగా ఉంటే - అది రజోగుణ వృద్ధికి సూచన.
         ఇంద్రియములు ప్రశాంతమైచిత్తము నిర్మలమైమనస్సు నిర్భయమైసంగరహితమైపరమాత్మను పొందుటకు అనుగుణముగా ఉంటే - అది సత్వగుణ వృద్ధికి సూచన.
              త్రిగుణములు జీవునికి చెందినవి కాదు. జీవుని యొక్క చిత్తమునకు సంబంధించినవి. చిత్తవృత్తి నిరోధము లేక మనోనాశ్‌ అయినప్పుడు జీవుడే పరమాత్మ.

త్రిగుణములు - ఉత్తరోత్తర గతులు : 
తమో గుణాశ్రయులు నిమ్న జాతి ఉపాధులలోనుస్థావరములలోను జన్మించిఅధోగతిని పొందెదరు. నరకమును కూడా పొందెదరు. రజోగుణాశ్రయులు మానవ లోకములోమానవులుగా జన్మించెదరు.
         సత్వగుణాశ్రయులు క్రమముగా బ్రహ్మసాక్షాత్కార మార్గములో బ్రహ్మోపాసకులైఊర్ధ్వ లోములవైపు యానము చేసెదరు. బ్రహ్మ లోకమును పొందుట కూడా జరుగును.
              నిర్గుణులు జీవించి ఉన్నప్పుడే సర్వలోకాతీతులై పరమును చేరెదరు. జీవన్ముక్తులై 14 లోకములకు కేవల సాక్షియైఅతీతులైవాటిని లీలా వినోదముగా చూచెదరు.

త్రిగుణముల బలము : 
సత్వగుణ వృద్ధితో దేవతలు బలపడుదురు. రజోగుణ వృద్ధితో మానవులు బలపడుదురు. తమోగుణ వృద్ధితో రాక్షసులు బలపడుదురు.

త్రిగుణ ఆహారములు :

సాత్వికాహారము : 
హితకరముశుద్ధముఇతరులకు బాధ కలిగించ కుండా సంపాదించుకొన్నది. అనాయాసఅబాధితఅనింద్యమైన సంపాదన వలన సమకూరినది సాత్వికాహారము.

రాజసికాహారము : 
ఇంద్రియ భోగ లక్ష్యముగా కలిగినది. వగరుపులుపుఉప్పు పదార్ధములుసహజీవుల బాధలను లెక్కచేయకపాపపుణ్య విచక్షణ లేక సంపాదించినది రాజసిక ఆహారము.

తామసికాహారము : 
దాహముదైన్యముమత్తు కలిగించేవిఅపవిత్రమైనవిఇతరులను బాధించి మోసగించి సంపాదించినది తామసిక ఆహారము.

గుణాతీత ఆహారము : 
భగవంతునికి నివేదించితిరిగి భగవత్ప్రసాదముగా స్వీకరించినదిన్యాయార్జితమైనదిదైవార్పితమైనదిమితముహితము అయిన ఆహారము గుణాతీతాహారము.
         అన్నము యొక్క సూక్ష్మాంశము మనస్సు కనుక సాధకులు ఆహార విషయములో జాగరూకులై యుండివారి మనస్సును సాత్వికము చేసుకునిచివరకు గుణాతీతము చేసుకొన్నచో వారు ముక్తులగుదురు.

త్రిగుణ మనస్సులు : 
విషయములు గ్రహించు ప్రకాశమున్న మనస్సు సత్వగుణము. ప్రవృత్తి రూప మనస్సు రజోగుణము. మోహరూప మనస్సు  తమోగుణము. ఈ విధముగా మనస్సు త్రిగుణములుగా నున్నది గనుక మనస్సన్నా మాయయన్నా ఒక్కటే. గుణాతీతమైన మనస్సు అనగా మనోనాశనమే. అందువలన అమనస్కమైనప్పుడు ఆత్మ ప్రకాశము స్పష్టము.
         మనస్సు తమోగుణము చేత ఉద్రిక్తమైనప్పుడు దంభముదర్పము మొదలగు అసుర సంపద పుట్టును. రజో గుణముచేత ఉద్రిక్తమైనప్పుడు తనలోని వాసనా త్రయము విజృంభించును. సత్వగుణముచేత ఉద్రిక్తమై నప్పుడు వివేకముసత్వశుద్ధి కలిగిజ్ఞానోదయమగును. అవిద్యా కార్యము లైన తమస్సురజస్సు నివర్తించబడును. అందువలన తమస్సు వలన కలిగిన ఆవరణము తొలగును. మరియు రజస్సు వలన కలిగిన విక్షేపము తొలగును. ఈ రెండూ తొలగినప్పుడు మిథ్యాభావము స్థిరమై వాసనా క్షయమగును. తాను బ్రహ్మమను అపరోక్షము సిద్ధించును.

త్రిగుణ పురుషార్థములు : 
సత్వగుణము వలన ధర్మమురజోగుణము వలన అర్థముతమోగుణము వలన కామము జనించును. శుద్ధ సత్వము వలన మోక్షముగుణాతీత స్థితివలన పరమపదము సిద్ధించును.

త్రిగుణ షడ్చక్రములు : 
మూలాధారములో తమస్సు విశేషమురజస్సు పూర్ణ వికాసముసత్వము నిస్తేజము. స్వాధిష్ఠానములో రజస్సు 75% సత్వము 25%, మణిపూరకములో రజస్సు 50% సత్వము 50%, అనాహతములో రజస్సు 25% సత్వము 75%, విశుద్ధములో రజస్సు 10% సత్వము 90%, ఆజ్ఞలో సత్వము 100% శుద్ధ తమస్సు ప్రారంభము.

త్రిగుణ ప్రభావము :

1. తమోగుణ ప్రభావమైనవి : 
తేళ్ళుపాములుపందులుకుక్కలుచేపలుకోళ్ళుకాకులునక్కలుక్రిములుదోమలుపొదలుచెట్లుఅవి నొప్పులుపీడ పొందును.

2. రజోగుణ ప్రభావమైనవి : 
బలముశౌర్యముమదముప్రాభవముసుఖదుఃఖములను అంచనా వేయగల నేర్పుస్నేహముకాంక్షఒప్పుకోలేక పోవుటమోసముకలహముఈర్ష్యచమత్కారముస్త్రీలపట్ల అతిగా అనురక్తి కలిగి యుండుట మొదలగునవి.

3. సత్వగుణ ప్రభావమైనవి : 
సంతోషముప్రకాశత్వముసత్యముశౌచముధైర్యముఅకుత్సితత్వముతిత్షిఅహింసఆర్జవముఅనసూయతఅక్రోధముఅసంరంభముసమతదాక్షిణ్యముశ్రద్ధలజ్జగౌరవముఅక్రూర స్వభావము మొదలగునవి.

త్రిగుణ వృత్తులు :
1. తమోగుణ వృత్తులు : 
క్రోధములోభముఅసత్యభాషణహింసయాచనదంభముతానొక్కడే శ్రమపడుతూ అలసిపోవుచున్నట్లుకాని ఇతరులు హాయిగా ఉన్నట్లు భావించుటకలహముశోకముమోహముదైన్యమువిషాదముఆవేదనమానసిక బాధసోమరితనముఅతి నిద్రఅత్యాశప్రతిదానికి భయపడుటపిరికితనమునైరాశ్యముఉద్యమించకపోవుటప్రయత్నములో వెనుకంజఆత్మహత్యా ప్రయత్నము మొదలైనవి.

2. రజోగుణ వృత్తులు : 
కామముప్రాపంచిక సంబంధమైన ఆలోచనలుఆశయములునిరంతరము ఏదో కార్యక్రమములో నిమగ్నమై యుండుటఆశతృష్ణదంభముమదముబేధ బుద్ధిసుఖాభిలాషమదోత్సాహముకీర్తి కాంక్షదృశ్యవస్తు ప్రీతితన ప్రతాపమును చూపవలెననెడి ఉబలాటముఉద్వేగ పూరితమైన ప్రయత్నముఅనవసరముగా అతిగా స్పందించుట మొదలైనవి.

3. సత్వగుణ వృత్తులు : 
శమముదమముతితిక్షవివేకపూరితమైన దృష్టి (ఈక్ష)తపస్సుసత్యముదయస్మృతితుష్టిసంతోషముత్యాగముఅస్పృహశ్రద్ధలజ్జఆత్మరతి మొదలైనవి.

త్రిగుణ సుఖములు :

తమోగుణ సుఖము : 
మోహముదైన్యముమత్తువలన కలిగే కల్పిత సుఖముఇతర సాధక బాధకములను లెక్కచేయకపోవుట వలన కలిగే కల్పిత సుఖము తమోగుణ సుఖమనబడును.

రజోగుణ సుఖము : 
విషయ భోగముల వలన అప్పటికప్పుడు కలిగే కల్పిత సుఖము రాజసిక సుఖమనబడును.

సత్వగుణ సుఖము : 
ప్రేమదయకర్తవ్య నిర్వహణపరోపకారమువాటికై కష్టపడుచున్ననూ కలిగే సుఖముసంతోషముతృప్తి సాత్విక సుఖము.

గుణాతీత సుఖము : 

పరమాత్మను కీర్తించుట వలన కలిగే తన్మయతమైమరపుఇత్యాదుల వలన కలిగే ఆనందముగుణాతీతానందము.


త్రిగుణములు ప్రకటించబడుటకు నిమిత్త స్థానములు : 

1. తెలియబడే దృశ్య జగత్తు 2. ప్రాణము 3. శక్తి 4. ప్రకృతి 5. జనులతో సంసర్గము 6. దేశము 7. కాలము 8. కర్మ 9. జన్మ 10. వాతావరణము 11. ధ్యానము 12. మంత్రము 13. సంస్కారము 14. శ్రద్ధ, 15. తపస్సు, 16. సాధన మొదలగు వానిలో మనలో ఏదో ఒక గుణము ప్రకటించ బడుచూ ఉండును. త్రిగుణములు చిత్తములో పుట్టి మనస్సులో దాగి బుద్ధి నిర్ణయముగా ప్రకటించబడుచూ ఉండును.
              పైన పేర్కొన్న స్థానములను విచారించినచో త్రిగుణ స్వభావమును అనేక ఉపాయములతో తొలగించుకొనగలరు. త్రిగుణాతీతమగు బ్రహ్మమగుట కొఱకు త్రిగుణములను ఆయా స్థానములందు గుర్తించివిచారించిసాధనలతో అధిగమించగలరు. త్రిగుణ రహితమనగా భ్రాంతి రహితముఅనగా మోక్షమే.

అసుర సంపత్తి : 
కేవలము శరీర పోషణధారణతో జీవించుచూ రజస్తమోగుణ మాలిన్యములతో కూడిన భావములుండుట అసుర సంపత్తి. అసద్వృత్తులే అసురులు.

దైవీ సంపత్తి : 
రజస్తమో మాలిన్యము పూర్తిగా తొలగి చైతన్య ప్రకాశముతో వెలువడే భావములుండుట దైవీ సంపత్తి. సద్వృత్తులే దేవతలు.

దైవీ సంపత్తి గుణములు : 
నిర్భయత్వముచిత్త శుద్ధిఆత్మజ్ఞానోపాయమైన నిష్ఠదానముఇంద్రియ నిగ్రహముయజ్ఞములుక్రతువులుహోమములుఅధ్యయనముత్రివిధ తాపములు లేకుండుటఆర్జవముత్రికరణ శుద్ధిచే ప్రాణిపీడావర్జనముసత్యముఅక్రోధముఔదార్యముమహాశాంతముపరుల దోషములను పరోక్షముగా కూడా ఎంచకుండుటసర్వ ప్రాణులందు దయఅలోభముమృదు స్వభావముఅకార్యములందు లజ్జచపలత్వము లేకుండుటప్రగల్భములాడకుండుటఓరిమిధైర్యముబాహ్యాభ్యంతర శుద్ధిద్రోహచింతన లేకుండుటనిరభిమానము. 

బ్రహ్మర్షి : 
జ్ఞానులైన వారి క్రియలందు సత్వగుణము ప్రధానముగా ఉన్న యెడల వారిని బ్రహ్మర్షులందురు.

రాజర్షి : జ్ఞానులైన వారి క్రియలందు రజోగుణము ప్రధానముగా ఉన్న యెడల వారిని రాజర్షులందురు.

త్రిగుణ ధ్యానాభ్యాసములు : 
ధ్యానాభ్యాసమందు తమోగుణము ఉద్రేకించి నప్పుడు దట్టమగు చీకటి గోచరించును. రజోగుణము ఉద్రేకించినప్పుడు ఉదయించే సూర్యునితో సమానమగు తేజము గోచరించును. సత్వగుణము ఉద్రేకించినప్పుడు కేవలము బయలు గోచరించును. నిర్గుణ సమాధియందు బయలే తానై యుండును. గుణములు తిరిగి తోచినప్పుడు సమాధి విరమణయై తిరిగి సంసారము తోచును. పరిపూర్ణ బోధవలన త్రిగుణ రహితమైతే బయలు స్వతస్సిద్దము.

త్రిగుణముల ఎరుక బేధము : 
మాయ త్రిగుణాత్మకము. అందలి సత్వాంశము వలన త్రిమూర్తులు శక్తి రూపులైన అధిష్ఠాన దేవతలు కలిగిరి. తామసాంశము వలన జడ జగత్తు తోచెను. సత్వతమో గుణముల మిశ్రమము వలన రాజసాంశము కలిగిదాని వలన జీవులు తోచిరి. సత్వాంశ జనితమును కేవలపు టెరుక అనియురాజసాంశ జనితమును మిశ్రమపుటెరుక అనియు తామసాంశజనితమును మలినపుటెరుక అనియు అందురు.
         కేవలపు టెరుకగా నున్న బ్రహ్మయందు రజోగుణము వలన సంకల్పము కలిగి చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేయుచుండెను. సత్వగుణము వలన సృష్టియొక్క స్థితిని విష్ణువు పోషించుచుండెను. తమోగుణము వలన ఆ సృష్టిని రుద్రుడు లయము చేయుచుండెను.
         మలినపుటెరుకగానున్న పంచభూతములు సమష్టిలో బ్రహ్మాండమైవ్యష్టిలో పిండాండములైనవి. తమోగుణములోని సాత్వికాంశము అంతఃకరణ గానుజ్ఞానేంద్రియములుగాను మారెను. తమోగుణములోని రాజసాంశము పంచప్రాణములుగాను కర్మేంద్రియములుగాను మారెను. తమోగుణములోని తామసాంశము జీవోపాధులుగా మారెను.
              మిశ్రమపుటెరుకలోని ప్రాణులుజీవులలో మూడు గుణములు ఎక్కువగానోతక్కువగానో ఉండివారి వారి స్వభావము ప్రకారము ఏదో ఒక గుణ ప్రధానముగానుమిగిలిన రెండు గుణములు అణగియుండి ప్రవర్తించుచున్నారు.
         ఈ విధముగా త్రిగుణములు ఏ రూపములో ఎంతమాత్రమున్నను అది యంతయు మాయాకార్యమే. త్రిగుణ రహితమునకు చేసే సాధనలుఫలించినప్పుడు తానే పునరావృత్తి లేని పరబ్రహ్మము అనే పరమపదము సిద్ధించును.

శ్లో||  ఉదాసీన వదాసీనో గుణైర్యో నవిచాల్యతే |
       గుణావర్తంత ఇత్యేవ యో-వతిష్ఠతి నేంగతే ||


తా||    త్రిగుణములకునువాటి కార్యరూపమైన శరీరేంద్రియ అంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చలించకత్రిగుణాతీతుడుఉదాసీనునివలె ఉండిగుణములే గుణములతో ప్రవర్తించుచున్నవని తలంచువాడు సత్‌చిత్‌ ఆనంద ఘనుడై అచలుడై యుండును.