వర్ణ ధర్మములు

10. వర్ణ ధర్మములు

శ్లో||  జన్మనా జాయతేశూద్రః కర్మణా జాయతే ద్విజః
       వేదపాఠంతు విప్రాణాం బ్రహ్మజ్ఞానంతు బ్రహ్మణః

వర్ణములు చేతనాశక్తి భేదము చేత నిర్ణయింపబడినవి :

1. బ్రాహ్మణులు 
మనస్సుబుద్దిచిత్తముఅహంకారము - ఈ నాలుగు ఎవరిలో చక్కగా పనిచేయునో వారే బ్రాహ్మణులు. వీరి స్వభాము శమముదమముసత్యముఅహింసమొదలగు సద్గుణములు కలిగియుండుట.

2. క్షత్రియులు : 
మనస్సుబుద్ధిఅహంకారము - ఈ మూడు ఎవరిలో బాగుగా పనిచేయునో వారే క్షత్రియులు. వీరి స్వభావము తేజస్సుబలముశౌర్యముఐశ్వర్యము కలిగి యుండుట.

3. వైశ్యులు : 
మనస్సుబుద్ధిఈ రెండు చక్కగా ఎవరిలో పనిచేయునో వారే వైశ్యులు. వీరి స్వభావము ఆస్తికత్వముదానమునిష్ఠధన సంచయము కలిగియుండుట.

4. శూద్రులు 
మనస్సు ఒక్కటే ఎవరిలో పనిచేయునో వారే శూద్రులు. వీరి స్వభావము ఇతర మూడు వర్ణములలో చెప్పబడినవి లేకుండుట. అందువలన దేవగోబ్రాహ్మణ సేవ చేయుచుపై మూడు వర్ణముల వారికి సహాయము చేయుట వలన వారి స్వభావమును క్రమముగా పెంపొందించుకొనగలరు.

5. అంత్యజులు : 
శుచి శుభ్రతలు లేకుండుటఅబద్ధములాడుటదొంగతనము చేయుటనాస్తికత్వముకలహ ప్రియముకామక్రోధ తృష్ణలుకలిగియున్నవారు అంత్యజులు.
         ఈ వర్ణములు వారి వారి గుణకర్మ స్వభావములను బట్టి నిర్ణయింపబడినవే గాని తల్లిదండ్రుల నుండి సంక్రమించినవి కాదు. స్వభావమును మెరుగుపరచుకున్నవారు తగిన వర్ణస్థులగుదురు. జన్మతః వర్ణములందు ఉచ్ఛనీచములు లేవు.

స్వాభావిక లక్షణములు:
1. బ్రాహ్మణులు : 
శమము అనగా మనో నిగ్రహము. దమము అనగా ఇంద్రియ నిగ్రహముశౌచము అనగా పవిత్ర భావములుభగవత్‌ ప్రసాద బుద్ధిదైవేచ్ఛ అనే ప్రపత్తితపస్సు అనగా భగవత్‌ విశేషములపట్లసాధనలపట్ల తపనతో కూడిన ప్రయత్నము చేయు స్వభావముసంతోషము అనగా ఏది ప్రాప్తించినా సంతోషము తృప్తి కలిగియుండి అవగాహన పెంపొందించుకొను స్వభావముక్షాంతి అనగా కష్ట సుఖాలు రెంటిని సాధన కొఱకు పెట్టిన పరీక్షలనే భావముతో ఉంటూఆత్మ దృష్టి కలిగి యుండుటఆర్జవము అనగా త్రికరణములు ఏకీకృతమైశుద్ధిగా నుండునట్లు అభ్యసించుట. భక్తి అనగా పరాభక్తిపరాప్రేమను పెంపొందించుకొనుటదయ అనగా తానుకోరే దయనుఅట్లే సహజీవుల యెడల కలిగియుండుటఇతరుల కష్టములు తనవైతే ఎట్లోఅట్లే భావించివీలైనంత సహాయము చేయుటసత్యము అనగా సర్వజీవులలోని నిత్యమైన సత్యమును ఆశ్రయించుచుసందర్శించుచుఅవలంబించుచుఆరాధించుచు ఉండే స్వభావము.

క్షత్రియులు : 
తేజస్సు అనగా విషయములను సత్య దృష్టితోపవిత్ర దృష్టితో ఆకళింపు చేసుకునే వివేక కాంతితో విరాజిల్లుటబలము అనగా శరీర మనోబుద్ధుల బల సంపన్నతను పెంపొందించుకొనుటధృతి అనగా ధైర్య స్థైర్య సంపన్నతశౌర్యము అనగా సమస్యలను సమర్ధతతో ఎదుర్కోగల ఉత్సాహముసాహసము వృద్ధి చేసుకొనుటతితిక్ష అనగా సహనముఓర్పు అలవరచుకొనుటఔదార్యము అనగా ఉదారత త్యాగ నిరతిఇతరుల సుఖశాంతులు, సంతోషముకొఱకు ఏదైనా చేయాలనే స్వభావముఉద్యమము అనగా కార్యములను చేపట్టి సఫలము చేయుటకు ఉత్సాహముతో ఉద్యమించు శక్తి సంపన్నత.

వైశ్యులు : 
ఆస్తిక్యము అనగా పరమాత్మ యొక్క సర్వతత్త్వ స్వరూపముపట్ల తన బుద్ధి చిత్తములను ఆయత్తపరచి పెంపొందించుకొను స్వభావముదానము అనగా దానధర్మములు నిర్వర్తించే శ్రద్ధఅభ్యాసములను పెంపొందించుకొను స్వభావమునిష్ఠ అనగా శాస్త్రములలో చెప్పబడే విధి విధానములను తాను నిర్వర్తించవలెనని నియమనిష్ఠలు కలిగియుండుటఅదంభము అనగా దంభముదర్పముగర్వములను త్యజిస్తూఅణకువప్రపత్తిశరణాగతితో కూడిన స్వభావముసంపద అనగా సంపదలను వృద్ధి చేసుకొనవలెననెడి ఉత్సాహముబ్రహ్మ సేవనము అనగా బ్రహ్మజ్ఞులువేదజ్ఞులపట్ల సేవాభావము.

శూద్రులు : 
శుశ్రూష అనగా దేవగురుబ్రాహ్మణసాధుసన్న్యాసులపట్ల నిస్వార్థ నిష్కపట సేవా నిరతి కలిగియుండితద్వారా లభించిన భ్పతితో సంతృప్తులగుట.

అంత్యజులు : 
పై చతుర్వర్ణస్థుల ధర్మ నిరతిని ఏమరచినవారు. అశౌచముఅనృతముస్తేయమునాస్తిక్యముకామక్రోధ ప్రధానములు కలిగియుండు స్వభావముఇంద్రియ విషయములపట్ల సదా మననముతపన కలిగియున్న స్వభావముఎంత పొందినా కృతజ్ఞత ఉండకఅసంతృప్తితో అలమటించే స్వభావము.

బ్రాహ్మణ్యము : 
బ్రహ్మ జ్ఞానులను సేవించితద్వారా లోకహితమును తెలుసుకొనిఅమలు చేయు స్వభావము.

అన్ని వర్ణముల వారు ఆచరించవలసిన ధర్మములు :

1. అహింస : శారీరకముగా గానిమానసికముగా గానిబాధించకుండుట.

2. సత్యము 
సత్యమును ఆశయముగా కలిగియుండిసత్యమును దర్శించుటసత్యమును ఆశ్రయించుటసత్యము పలుకుటసత్యాన్వేషణ జరుపుట.

3. అస్తేయము : ఇతరుల సంపదను ఉచితముగా గానిఅక్రమముగా గాని పొందే బుద్ధి లేకుండుట.

4. అక్రోధము : క్రోధావేశములను నిగ్రహించిపోగొట్టుకొనుట.

5. అలోభము : నాది నాకే ఉండవలెననియుఎవరితోనూ పంచుకొనను అనే బుద్ధిని విడచిపెట్టుట.

6. భూతప్రీతి : సహజీవులకు ప్రీతిసంతోషము కలుగజేయు ఉద్దేశ్యము.

7. భూత హితము : 
ఇతరుల హితముశ్రేయస్సు కోరుకొనుటప్రయత్నించుట. జంతువులుపక్షులువృక్షములు మొదలగు భూతములకు ఆహార పానీయములనిచ్చి సంతోషపెట్టుట.

చతుర్వర్ణ ధర్మములు :

1. బ్రాహ్మణులు : 
వేదాధ్యయనము పరమ ధర్మము. విహిత కర్మలను వేద ప్రమాణముగా నియమ నిష్ఠలతో చేయవలెను. దయ కలిగి యుండవలెను. శాంతమును విడువరాదు. ఉదాత్తమైన పద్ధతిలో లభించిన ధనమును కేవలము తన సంతానమునకే గాకయోగ్యులైన వారికి ధర్మ మార్గములో పంచవలెను. గర్వము పనికిరాదు.

2. క్షత్రియులు : 
యజ్ఞములు చేయుటదానక్రియలువేదాధ్యయనముదుర్మార్గులను శిక్షించుటప్రజలనుండి అనురాగమును పొందే విధముగా రాజ్యపరిపాలననిర్భీతితో పరాక్రమించుటయుద్ధము చేయుట.

3. వైశ్యులు : 
వేదాధ్యయనముదానములుయజ్ఞముల నిర్వహణన్యాయముగా ధనార్జనసక్రమముగా ఖర్చు చేయుటపశు సంరక్షణ.

4. శూద్రులు : 
పై మూడు వర్ణముల వారికి మంచిగా పనులు చేసి పెట్టుచుబ్రతుకుట.

నాలుగు వర్ణముల వారికి గల ధర్మములు : 
కోపము ఉండకూడదు. సత్యమే మాట్లాడవలెను. కట్టుకున్న భార్యతోనే భోగించవలెను. శుచిగా ఉండవలెను. డాంబికము లేకుండా ఒదిగి యుండవలెను. ఎవరికీ ద్రోహము తలపెట్టరాదు.

క్షత్రియుని లోక తంత్రములు : 
ఆత్మధృతిదాక్షిణ్యముదేశముకాలముపరాక్రమము అనే అయిదు లోక తంత్రములు. వీటిని బాగుగా తెలుసుకొనిధర్మవిదుడైన ఉత్తమ క్షత్రియుడు తన రాజ్యమును చక్కగా పాలించును.

చతుర్వర్ణ కర్మోపాసకులు :

1. బ్రాహ్మణులు : 
వీరిలో బ్రహ్మయతులు అని ఉందురు. ఇదంతా పరబ్రహ్మ స్వరూపమే కదా! నాతో సహా సర్వమూ అద్వితీయ నిరామయ నిరాకార నిర్గుణ బ్రహ్మము యొక్క చమత్కార సంప్రదర్శనమే అనెడి అవగాహన పెంపొందించుకొనుటకు మనస్సు యొక్క శుద్ధి కొఱకై కర్మలుఉపాసనలు విధిగా చేపట్టేవారు బ్రహ్మయతులు. వీరిది సాత్వికోపాసన.

2. క్షత్రియులు : 
వ్యవహార దక్షతకార్య దీక్షపరిస్థితుల సానుకూల్యతపేరు ప్రతిష్ఠలు - ఇట్టి వ్యవహారికమైన ఆశయములతో వాటి సముపార్జనకై పరమాత్మను ఉపాసించేవారు. ఇది సామర్ధ్య రాజసికోపాసన.

3. వైశ్యులు : 
వస్తు సమృద్ధిధనగృహ సంపద మొదలైనవి పొందుటకు లక్షితులై దైవోపాసన చేయువారు. వీరిది సంపద సిద్ధి రాజసికోపాసన.

4. శూద్రులు : 
ఇంద్రియ సంబంధమైన అనుభవముల సంప్రాప్తికై దైవోపాసనను ఆశ్రయించేవారు. వీరిది ఇంద్రియానంద ఆశ్రిత తామసికోపాసన.

ఉర్వి : 
వర్ణాశ్రమ ధర్మములు నశించిఅధర్మముపాపము పెరిగి భూమి క్రుంగిపోగాకశ్యప మహర్షి తన ఊరువులను దన్నుగా పెట్టిభూమిని పైకి లేవనెత్తినందు వలనభూమికి ఉర్వి అని పేరు వచ్చినది.

కృతయుగము పేరు : 
ఈ యుగారంభములో హంస అను ఒకే వర్ణముండెను. చాతుర్వర్ణములు లేవు. హంస శబ్దార్థము పరతత్త్వమే. జనులు జన్మతః అనన్య భక్తి పరాయణులై జగత్తును ఈశ్వర భావముతో ఉపాసించుచూ అతి త్వరగా కృతకృత్యులయ్యేవారు. ఇది హంస యోగము. అందువలన ఈ యుగమునకు కృతయుగమనే పేరును శాస్త్రవేదులు నిర్ణయించిరి. ఈ యుగములో వేదము ప్రణవాత్మకముగా అనుభవమయ్యేది.

కలియుగములో వర్ణసాంకర్య ఫలితములు : 
మానవులు సత్యమునకుధర్మమునకు దూరమగుదురు. ఆయుఃప్రమాణము తగ్గిపోవును. అజ్ఞానముప్రబల మోహముదాని వలన లోభము కలిగి కామమునకు దారి తీయును. దానివలన క్రోధముదానివలన వైరము ఉద్భవించును. సకల వర్ణములలో ఒకరినొకరు బాధించుకునే శత్రుత్వము ఉదయించును. హద్దులు మీరి అందరూ వర్ణ సాంకర్యము చేయుదురు. బ్రాహ్మణులు జపతపములుస్వాధ్యాయమునియమ నిష్ఠలు విడచిపెట్టెదరు. అదే సమయములో శూద్రులు అధిక తపస్సంన్నులగుదురు. అరాచకము ప్రబలి ధర్మము నశించి ధనాపేక్షగల నీచ జాతులతో నిండిపోవును. అన్ని వర్ణముల వారిలోవారి స్వధర్మము క్షీణించిశారీరక మానసిక బలహీనతలు పెరుగును. మద్యపానమువ్యభిచారముఅపనమ్మకము పెరిగి అందరూ భ్రష్టులగుదురు.
         రస వస్తువులలోసుగంధ ద్రవ్యములలో గుణము తగ్గిపోవును. పాడిపంటలు తగ్గును. నాణ్యత తగ్గిపోవును. పన్నులు అధికముగా వసూలు చేసెదరు. జనులు భయాందోళనలో జీవించుచుందురు. మోసము అధికమగును. శరీరముపై ఆసక్తి కలిగి దానినే ఆరాధించెదరు. వారికి ముక్తి అసాధ్యమగును. కలియుగాంతములో పదహారు సంవత్సరములే పూర్ణాయువు. ఏడెనిమిదేళ్ళకే ఆడపిల్లలు బిడ్డలని కందురు. వేదధర్మములు శూద్రులు చెప్పగా బ్రహ్మణులు ఆసక్తితో విందురు. గురువంటే శిష్యునికి లక్ష్యముండదు. కుటుంబ వ్యవస్థ పాడైపోవును. యుద్ధములుఉత్పాతములు సంభవించును. దేవతారాధనలుపితృకార్యములువేద బోధ ఆగిపోవును. పెద్దల బోధను పెడచెవిన పెట్టెదరు. దుష్టులు అధికమయ్యెదరు.
              కలియుగాంతములో శంబళ గ్రామములో విష్ణువు విష్ణుయశుడనే పేరుతో కల్కిగా అవతరించికృతయుగ ధర్మమును మరలా స్థాపించును.

శ్లో||  యదాయదాహి ధర్మస్యగ్లా నిర్భవతి భారత |
       అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌ ||
                                                                    - శ్రీకృష్ణ పరమాత్మ

తా||    ధర్మమునకు హాని కలిగినప్పుడునుఅధర్మము పెచ్చు పెరిగినప్పుడును నన్ను నేను సృజించుకొందునుఅనగా సాకార రూపముతో అవతరించెదను.