భక్తి రహస్యము

4. భక్తి రహస్యము

శ్లో||  హరిః ఓం|| వాచకః ప్రణవోయస్య క్రీడా వదఖిలం జగత్‌
       శ్రుతివాఙ్మానసాతీతం వందే దేవకీ సుతమ్‌ ||

భక్తి : అఖండమైయున్న సత్య వస్తువు భ్రాంతి వలన నానాత్వముగా గోచరించుచుండగావిభక్తమైన వ్యష్టి జీవుడుతిరిగి సమష్టి రూపమైన ఈశ్వరునియందు స్నేహ భావముతో దగ్గరై సుఖమునందుటను భక్తి అందురు. ఈ విధముగా భ్రాంతి రహితమై అఖండ సహజ స్వరూపమైన పరమాత్మ లక్షణముగా ఉండిపోవుటను పరాభక్తి లేక మోక్షము అందురు.

ప్రపత్తి : భగవంతునిపై విశ్వాసముతో తన భారమును ఆయనపై ఉంచినట్టి శరణాగతిఅంతా భగవదేచ్ఛ నాది అనేదేమీ లేదు అని నిశ్చింతగా యుండుటను ప్రపత్తి అందురు. కైంకర్యమే ప్రపత్తి.

ప్రపర్ణులు : భక్తులు

నాయనారులు : శివ భక్తులు

ఆళ్వారులు : విష్ణు భక్తులు

భాగవతోత్తముడు : దేవునికి చెందినవాడు. భగవదనుభూతి పొందివాడు. భగవంతునితో సమానమైనవాడు.

శేషి : భగవంతుడు

శేష భూతులు : భగవంతుని చేతిలో ఆయన కార్యక్రమము నిమిత్తము ఆయనకు పనిముట్టుగా నున్నవారు.

దేవుడు : స్వయముగా ప్రకాశించుచూ వ్యాప్తమైయున్నవాడు. అది నిరుపాధికమైన ఆది మధ్యాంత రహితమైన జ్ఞాన ప్రకాశ రూపము.

వాసు దేవుడు : అన్నిటియందు తాను వశించుచుఅన్నిటినీ ప్రకాశింప జేయుచూఅన్నీ తనయందే వసించుచుండగాతాను మాత్రము స్వయం ప్రకాశరూపుడైనవాడు. సర్వమును ప్రకాశింపజేయుచువ్యాప్తమై యున్నవాడు.

భగవంతుడు : భగములు కలవాడు భగవంతుడు. భగము అనగా జ్ఞానమువైరాగ్యముఐశ్వర్యముశ్రీయశస్సుఆనందము అను ఆరు లక్షణములు.

షడ్గుణైశ్వర్యుడు : జ్ఞానమువైరాగ్యముఐశ్వర్యముశ్రీయశస్సుఆనందము అనే ఆరు లక్షణములు కలవాడు.

దేవతలు : ఈశ్వర చైతన్యము యొక్క విభూతులే దేవతలు. ఆ చైతన్యము యొక్క ఒక్కొక్క తరంగము ఒక్కొక్క దేవతగా పిలువబడును.

వైశ్వ దేవులు : ఏ పరమాత్మ చైతన్యము ఈ విశ్వమంతా విరాజమానమై చిత్కళలుగా వెలుగొందుచున్నదోఆ కళలే వైశ్వ దేవులు.

సురులు : మంచిని తీసుకొనుచుమంచి స్వభావులుగా ఉన్నవారు దేవతలు.

అసురులు : చెడును తీసుకొనుచుచెడు స్వభావులుగా ఉన్నవారు రాక్షసులు.

శివ : శుభముమంగళముశాశ్వతమైన స్థిరత్వముగా నున్నవాడు అనగా జ్ఞాన స్వరూపుడు.

శంకర : శుభమునుకైవల్యమును చేకూర్చువాడు

రుద్ర : రుత్‌+ద్ర = దుఃఖమును నశింప జేయువాడు

పరమేశ్వర : సృష్టికి మూలాధారము

మహేశ్వర : సర్వ భూతాంతర్యామిసర్వ ప్రాణాధిపతి

ఈశ : సర్వ స్వతంత్రుడుప్రభువు అయిన కేవలాత్మపరమాత్మ

అగ్నిహోత్ర : ప్రాణుల శరీరములలో అగ్ని రూపముగా ప్రకాశించే ఆత్ముడు.

సప్త జిహ్వలు : పంచ వాయువులుమనస్సుబుద్ధి. ఈ ఏడు అగ్ని హోత్రుని సప్త జిహ్వలు.

విఘ్నేశ్వర రూపము : మనోసాధనఅంతఃసాధనప్రాణ క్రియాసాధనజీవసాధనఆత్మ సాధన అనెడి పంచ సాధనలలో పంచ విధములగు విఘ్నములు కలుగును. వాటిని తొలగించుకొనే సాధన చేసి భగవత్సాక్షాత్కారము పొందవలెను. ఈ సాధన పంచకమే విఘ్నేశ్వర రూపము.

ప్రజాపతి : జీవాత్మలు అనెడి అనేకత్వమునకు ప్రభువు.

హృషీకేశ : హృషీకములనగా ఇంద్రియములు. ఈశ అనగా ప్రభువు. ఇంద్రియములను జయించియున్న ప్రభువే హృషీకేశుడు.

గోవింద : జీవులను లేక భూమిని ఉద్ధరించువాడు

విష్ణువు : కేవల చైతన్య వ్యాపకత్వముసర్వమూ తానై సర్వముగా వ్యాపించియున్న పరబ్రహ్మ. మొదటిది చేతనాంశము. రెండవది ఆభాసాంశము.

వైకుంఠము : కుంఠితము కానిది. అనగా దోషములు లేనిది. మోక్ష ధామము.

హరి : ఇంద్రియోన్ముఖమైన వృత్తులను హరింపజేయువాడు.

నారాయణ : న+అరాః+అయన = దోషములు లేని నిలయము = త్రిగుణ దోషములు లేనిది = మోక్షము = పరబ్రహ్మ.

మాధవుడు : మా+ధవుడు = లక్ష్మి+పతి = లక్ష్మీపతిప్రకృతి+ప్రభువు=  ప్రకృతిని జయించిన పురుషుడు.

రామ : విశుద్ధ సత్వము వలన కలిగిన ఆనందముతనలో తాను రమించువాడు. ఇతరులను రమింపజేయువాడు కూడా.

ఆత్మా రాముడు తనలో తాను రమించు ఆత్మ స్వరూపుడు.

దుర్గ : దుర్లభమైనదిఅతి కష్టము చేతనే పొందదగినది. దుర్గతి నుండి రక్షించునది అనగా సద్గతిని కలిగించునది.

సరస్వతీ : స+రసవతీ= విద్యలన్నింటిలోను సారమురసము అయిన విద్యా రూపము. ఆధ్యాత్మిక విద్యా రూపమును జ్ఞాన సరస్వతి అందురు.

శ్రీ : విష్ణువు నుండి వెలువడిజీవజగత్తులను ఆక్రమించిన చైతన్య ప్రకాశముమోక్షమనే సంపదనిచ్చునది. శ్రీ అనగా శక్తి త్రయము. నిర్గుణ పరమాత్మను సగుణముగా చూపే శక్తి.

లక్ష్మీ : జీవులలో వ్యాపించియున్న చైతన్య ప్రకాశము. జీవులలో ఆత్మగా పిలువబడే విష్ణుసాన్నిధ్యమునకు గొనిపోవునది. లక్ష్యమును సిద్ధింప జేయునది లక్ష్మీ. ఈ లక్ష్మీ యనునది మొదట మంచితనము వలన కలిగి పెద్దరికము వలన పెరిగి దక్షత వలన పాదుకొనునది. నిగ్రహము కారణముగా నిలిచియుండి లక్ష్య సిద్ధి కలిగించును.

లక్ష్మీదేవి మెచ్చే గుణములు : గురు భక్తిదేవ పితృ పూజలుసత్యమును పలుకుటదానశీలతపరధన పరదారలను కోరకుండుటనిజ బ్రాహ్మణ భక్తిపగటిపూట నిద్రించకుండుటవృద్ధులనుపేదలనుబలహీనులనుస్త్రీలను ఆదరించుటశుచిఅతిధులకంటే ముందుగా భుజించకుండుటవారు తినగా మిగిలినది తినుట మొదలగునవి.

లక్ష్మీదేవి మెచ్చని గుణములు : ధర్మమును వదలుటఅరిషడ్వర్గమునకు లోబడుటబలి బిక్షలు పెట్టకుండుటగర్వముక్రూరత్వము దురుసుగా మాట్లాడుట మొదలగునవి.

లక్ష్మీదేవిని వృద్ధి పొందించుట : బుద్ధిధైర్యమునీతిశ్రద్ధవినయముఓర్పుశాంతిమరియు ఎనిమిదవదైన లక్ష్మీదేవి. ఈ దేవతలు లక్ష్మీని వృద్ధి చెందించును. లక్ష్మీ దేవినే శ్రీ అనిభూతి అని కూడా అందురు.

కృష్ణ : 
కృష్‌+ణ = ఎల్లప్పుడూ ఉండునది+ఆనంద రూపము=సదానంద రూపము.
కృష్‌+ణ=భూమి+నివృత్తి=ఐహిక భోగ నివృత్తి = మోక్షముపరబ్రహ్మ
కృష్‌ అనగా కర్షణ శక్తితనలోనికి ఆకర్షించుకొనుట అనెడి కర్షణ శీలి. అనగా భక్తులకు తనతో ఐక్యతను ప్రసాదించేవాడు.

ఆరాధన : రాధ్‌ అనగా తృప్తి. ఆరాధ్‌ అనగా తృప్తిపరచుట. ఆరాధన అనగా భగవంతునికి ప్రీతి కలిగించుట. రాధ అనగా భగవత్ప్రేమ స్వరూపిణి.

భరత : ప్రకాశముజ్ఞానముల పై రతిలేక ఆసక్తుడైయున్నవాడు. జ్ఞాన విషయములో ఆసక్తమైయున్న దేశము భారత దేశము.


ముప్పది మూడు కోట్ల దేవతలు : అష్ట వసువులుఏకాదశ రుద్రులుద్వాదశ ఆదిత్యులుఇంద్రుడుప్రజాపతి కలిసి ముప్పది మూడు. వారి వారి గణములతో కూడి ముప్పది మూడు కోట్ల దేవతలు. 


పంచాయతనము లేక పంచ మూర్తులు :
1. స్వర్ణముఖీ నదిలో అమ్మవారి శిలలు
2. కొండలలోని స్పటికములనుండి సూర్య భగవానుని రూపములు
3. నర్మదానదిలో శివలింగములు
4. గండకీ నదిలో విష్ణు సాలగ్రాములు
5. గోమతీ నదిలో వినాయకుని శిలలు

పంచామృతము : ఆవు పాలుఆవు పెరుగుఆవు నెయితేనెనారికేళ జలము (లేక నీరు)

పంచగవ్యము : గోవుకు సంబంధించిన పాలుపెరుగునేయిపేడపంచితము (మూత్రము)

విభూతి :
1. గోమయమును భస్మము చేయగా వచ్చినది.
2. రావిమోదుగ పుల్లల భస్మము
విభూతి యొక్క పవిత్రతవిభూతి ధారణ ఫలితములు : గోమయ భస్మమునకు ఐదు పేరులు.

1. విభూతి : ఆధ్యాత్మిక శక్తినిచ్చును గనుక విభూతి యని పేరు. సద్యోజాత - ఐశ్వర్యము నిచ్చునుసద్యోజాతము నుండి భూమిభూమి నుండి నిర్వృత్తి. నిర్వృత్తి నుండి కపిల వర్ణముగల నంద అనే గోవు పుట్టెను. ఆ గోవు  యొక్క గోమయము నుండి విభూతియను భస్మమును చేయుదురు.

2. భస్మము : సర్వ పాపములను దహించునది గనుక భస్మము అని పేరు. అఘోర - పాపహరణ చేయును. అఘోర నుండి అగ్నిఅగ్ని నుండి విద్యవిద్యనుండి రక్త వర్ణము గల సురభియను గోవు పుట్టెను. దాని గోమయము నుండి భస్మమును చేయుదురు.

3. భసితము : బోధ అనగా జ్ఞానమును కలిగించునది గనుక భసితము అని పేరు. వామదేవ - తేజోవంతము చేయును. వామదేవ నుండి నీరునీరు నుండి ప్రతిష్ఠప్రతిష్ఠ నుండి కృష్ణ వర్ణముగల భద్ర అనే గోవు పుట్టెను. గోమయమునుండి భసితమును చేయుదురు.

4. క్షారము : ఆపదలను పోగొట్టును గనుక క్షారము అని పేరు. తత్పురుష - పాపహరణము చేయును. తత్పురుష నుండి వాయువువాయువు నుండి శాన్తిశాన్తి నుండి శ్వేత వర్ణముగల సుశీల అనే గోవు పుట్టెను. దాని గోమయమునుండి క్షారమును చేయుదురు.

5. రక్ష : భూతప్రేతపిశాచబ్రహ్మ రాక్షసులుఅపస్మారకముసంసార భయముల నుండి రక్షించునది గనుక రక్ష అని పేరు. ఈశాన - సంసార భయనాశనము చేయును. ఈశాన నుండి ఆకాశముఆకాశము నుండి శాంత్యాతీతముశాంత్యాతీతము నుండి చిత్ర వర్ణముగల సుమన అనే గోవు పుట్టెను. దాని గోమయ భస్మమే రక్ష అని పేరు గలది అయ్యెను.
         (సద్యోజాతఅఘోరవామదేవతత్పురుషఈశానులు ఐదును మహేశ్వరుని యొక్క పంచరూపములు. నిర్వృత్తిప్రతిష్ఠవిద్యశాన్తిశాన్త్యాతీతములనెడివి పంచ కళలు)
              గోవు సర్వ దేవతామయము. గోమయము శక్తిమంతము. శివుడు సృష్టించిన జగత్తులో ద్వంద్వములతో కూడిన భ్రమ ఉన్నది. శివుడనగా జగద్విషయక అగ్ని రూపము. విభూతి ద్వంద్వరూప భ్రమను భస్మము చేయగల శక్తి గలది. అగ్ని - విభూతిల కలయిక శివ-శక్తుల కలయిక. కనుక విభూతి ధారణ వలన శివక్త్యైక్యము సిద్ధించును గనుక అది పవిత్రము.

శ్రీ మహా విష్ణుతత్త్వమును ఎరిగినవారు : 1. మహేశ్వరుడు 2. ప్రజాపతి 3. కుమార స్వామి 4. కపిలుడు 5. నారదుడు 6. భీష్ముడు 7. మనువు 8. బలి 9. జనకుడు 10. ప్రహ్లాదుడు 11. వ్యాసుడు 12. శుకుడు. ఈ పండ్రెండు మందికే పూర్తిగా తెలుసునని ప్రతీతి.

భగవద్గీతను అప్పటికప్పుడు విన్నవారు 1. కర్మ రంగములో పరిణతి పొందిన అర్జునుడు. తనలోని రజోగుణమును శుద్ధపరచుకొని అజ్ఞానావరణను తొలగించుకొనెను.
2.పూర్తిగా తమో గుణములో మునిగియున్న ధృతరాష్ట్రునికి మమకార వ్యామోహములకు కారణమైన పుత్రులు, రాజ్యము వదలిపోయినవి.
3. సాకార నిష్ఠలో ఇష్టదైవమును దర్శించిన ఆంజనేయుడునిరాకార తత్త్వములో విలయమయ్యెను.
4. దివ్య దృష్టితో తెలుసుకున్న జితేంద్రియుడైన సంజయుడు ధృతరాష్ట్రునికి బోధించుటకు వినియోగించెను.
5. సర్వజ్ఞుడైన వ్యాసమహర్షి భగవద్గీత అమూల్య సందేశమును మహా భారతములో పదిలపరచిభావి తరములకు అందించెను.

దేవతలు వశమగు విధము : భక్తిబలినమస్కారముహోమముమంత్రముయజ్ఞముల వలన వశమగుదురు. సాహసముఎదురించుట వలన వశము గారు

మంత్రము : దైవమునుఆత్మను తెలియజేయునది.

మంత్రార్థము : దైవమనగాలేక ఆత్మయనగా ఏమి అర్థమో దానిని తన లక్ష్యముగా తెలియుట.

మంత్రాతీతము : ఎవరు తెలుసుకొను ప్రయత్నము చేయుచున్నారోవారు లేకుండా పోయిదైవముగాని ఆత్మగాని స్వతస్సిద్ధమై యుండుట.

శ్రీ దక్షిణామూర్తి : జ్ఞాన స్వరూపుడు

శ్రీ దత్తాత్రేయులు : బోధ స్వరూపుడు

శ్రీమన్నారాయణ : మోక్ష ప్రదాత

శ్రీ సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత

శ్రీ గాయత్రీ మాత : వేదమాత

అత్రి అనసూయ పుత్రులు :
1. బ్రహ్మ ఆశీస్సులతో సోముడు
2. శివుని ఆశీస్సులతో దుర్వాసుడు
3. విష్ణువు ఆశీస్సులతో దత్తాత్రేయులు జన్మించిరి. వీరిలో దత్తాత్రేయులు మాత్రమే త్రిమూర్తుల లక్షణములన్నీ కలిగియుండెను.


శమంతక పంచకము : 
పరశురాముడు మదోన్మత్తులైన క్షత్రియులను 21 పర్యాయములు దండెత్తి సంహరించెను. వారి రక్తమును 5 మడుగులలో ఉంచి పితృ తర్పణము చేసెను. పితృ దేవతలు శమించివారు పరశు రాముని శమించని కోరగా అతడు శాంతించెను. అందువలన ఈ 5 మడుగులకు శమంతక పంచకమని పేరు కలిగెను. ఈ ప్రాంతమునకే కురుక్షేత్రమని పేరు. అధర్మాన్ని శిక్షించిధర్మాన్ని రక్షించుట కొఱకు కురుక్షేత్రమే యుద్ధ క్షేత్రముగా శ్రీకృష్ణ పరమాత్మచే నిర్ణయించబడెను.

ఇష్టా పూర్తములు : 
ఇష్టములనగా అగ్ని హోత్రాది శ్రౌత కర్మలు. యజ్ఞ యాగాదులుసహస్రానామార్చనలుఏకాగ్ర చిత్తముతో పరమాత్మను హృదయపూర్వకముగా ఆరాధించుటపూజించుట మొదలగునవి.
         పూర్తములనగా బావులుచెరువులను త్రవ్వించుటశుభ్రము చేయుటత్రాగునీటి వసతివైద్య వసతి సహాయములను అందించుట. అనగా సహజీవుల సౌఖ్యము కొఱకు చేసే కర్మలు. వీటిని నారాయణ సేవగా సర్వమూ భగవత్స్వరూపమేనని చేసే కర్మలు. భక్తుని చిత్తము పవిత్రమగును. స్వార్థము పోయి సమష్ఠి భావమును పొందును. ఇష్టా పూర్తముల వలన ఇహలోక పరలోక సుఖములు కలుగును. అందుకొఱకు పునర్జన్మ తప్పదు. ఈ సత్కర్మలు సత్త్వగుణమును పెంపొందింపజేయును.

అవతారముల విశిష్టత :
1. రామాయణ భాగవతములలో నారాయణుడు అవతరించినరుణ్ణి ఉద్ధరించెను. ఇవి నారాయణుని చరిత్రలు.
2. భారతములో నారాయణుడు అవతరించి తన శక్తి వలనతన సారధ్యము వలన నరుడే శక్తిని పుంజుకొనినారాయణుని స్థాయికి ఎదిగి తరించెను. ఇది నరుని చరిత్ర.

అవతార సంభవము : 
పూర్వ సృష్టిలోని ప్రాణుల కర్మభోగములనిచ్చుట కొఱకుఈశ్వరుడు సంసిద్ధమైనప్పుడు తగిన కాలమందుఈ జగత్తు ఉత్పత్తియగుగాక అని సంకల్పము జనించును. అప్పుడు జగత్తు సృష్టించ బడును. జగత్పాలన చేసెదను గాక అని ఈశ్వరునిలో సంకల్పము కలిగిన వెంటనే జగత్తు రక్షింపబడుచున్నది. ఆ పాలనా కల్పము మధ్యలో ఉపాసకుల ఉపాసనా బలము వలన రామ లేక కృష్ణ అనబడే అవతారము ప్రతీతియగు గాక అని సంకల్పము ఉదయించినప్పుడు అవతారము ప్రతీతమగును. ఇతడు జీవుల వలె కర్మాధీనము కాదుభూత పరిణామము కాదు. ఈశ్వర చేతనమును ఆశ్రయించినట్టి మాయాపరిణామముగా అవతారుని దేహము ప్రతీతియగును.
         శిష్టుల పుణ్య ఫలితమైన సుఖ హేతువుదుష్టుల పాప ఫలితమైన దుఃఖ హేతువు అవతార కల్పితమునకు కారణము. తిరిగి పుణ్య ఫలితముగా శిష్టులను రక్షించుటపాప ఫలితముగా దుష్టులను శిక్షించుటఆయా అవతారుని యొక్క కర్తవ్యమై యుండును. జీవన్ముక్తులందరు అవతారులు కాదు. ఈశ్వరుడు తన చైతన్యాంశతో మాయాకల్పితమగు శరీరమందు చేరుట వలనఅది అవతారమని చెప్పబడును. ఈశ్వరుని సంకల్పముననుసరించిఇచ్ఛయించిన కార్యము ముగిసినంతనే ఈశ్వర చైతన్యాంశము ఆ అవతారుని శరీరము నుండి నిర్గమించును. ఇదియే అవతారుని శరీర విసర్జన.
         అవతారుని లోక వ్యవహారము లీలా విలాసము. శరీర ధారణ సమయములో కూడా స్వస్వరూప అపరోక్షానుభూతికి ఆటంకము కాదు. ప్రకృతిని ఉపకరణగా తీసుకొని యోగమాయచేత దేహ రూపములతో ప్రతీతియగుటను అవతరించుట లేక సంభవించుట అందురు.

భగవంతునికి అర్చన చేయుటకు కర్మకాండలు :
1. వైదికము : వేదోక్తములైన మంత్రములతో కూడినది.
2. తాంత్రికము : భౌతిక సంబంధమైన విధి విధానముల (తంతువుల)తో  కూడినది.
3. మిశ్రమము మంత్ర తంత్రములు రెండూ కలిపి అర్చించుట.

పూజా విధానము 
భగవంతునితో అనుసంధానమునకు దీక్ష తీసుకున్న భక్తుడు ఎటువంటి కాపట్యము లేకుండావిద్యుక్తములైన పెద్దల ప్రవచనములను శాస్త్ర యుక్తముగావిధి విధానములను అనుసరించి చేయవలెను. తనయొక్క స్వస్వరూపుడే అయివున్న భగవంతుడిని తనకు ప్రీతికరమైన నామ రూపములతో పూజించవలెను.

పూజకు ప్రతీకలు : 
1. ప్రతిమలు 2. పవిత్ర పుణ్యక్షేత్రములు (భూమి). 3. అగ్ని 4. సూర్యుడు 5. తీర్థముపుణ్యనదికలశ జలము, 6. హృదయము.

ప్రతిమలు : 
1.శిలామయము 2.దారు(కొయ్య)మయము 3. లోహమయము 4.లేప్యముగాని చందనముతో గాని చేసినవి 5. లేఖ్యము అనగా వర్ణ చిత్రములుపటములు 6. మణిమయము 7. సైకతము (ఇసుకతో చేసినవి) 8. మనోమయము. వీటన్నిటియందు భగవంతుడు వేంచేసియున్నాడని భావించవలెను.వీటికి ఆవాహన ఉద్వాసనలు లేవు.
         కాని అస్థిరమైన ప్రతిమలు అనగా మట్టితో గానిపిండితో గానిపసుపుతో గాని చేసిన వాటికి ఆవాహనాది షోడశోపచారములు చేసిఉద్వాసన పలికి పవిత్ర స్థలములో నిమజ్జనము చేయవలెను. ఈ విగ్రహములు మనోనిగ్రహము కొఱకే.

పూజలు ఫలవంతమగుటకు పవిత్రముగా ఉండవలసినవి :
1. దేశము : శరీరముపరిసరములుపుణ్యక్షేత్రములువనములుఆశ్రమములునదీ తీరములుదేవాలయములుమొదలగు ప్రదేశములు శుచిగా ఉండవలెను.
2. కాలము  : ఉదయ సాయం సంధ్యాకాలములుబ్రహ్మీముహూర్తముపుణ్య తిథులుఏకాదశిపౌర్ణమిమార్గశిర మాసములు పవిత్రము.
3.ద్రవ్యము :అనాఘ్రాణిత తాజా పుష్పములుఅక్షితలుతమలపాకులుచందనముకర్పూరముసాంబ్రాణిఊదొత్తులుపసుపుకుంకుమ మొదలుగునవి పవిత్రము.
4. కర్త : భక్తిసత్త్వ గుణముశ్రద్ధవినయముశరణాగతినిష్కపటముశమాదిషట్క సంపత్తియమనియమములు మొదలగునవి కర్తలో ఉండవలెను.
5. మంత్రము : గురు ముఖతా ఉపదేశించబడిన మంత్రము ఫలవంతమగును.

భగవదారాధన :
1. బింబము : విగ్రహ రూపములోనికి ఆవాహన చేసి పూజించుట
2. కుంభము కలశములోనికి ఆవాహన చేసి పూజించుట
3. మండలము : ధాన్యరాశిపైకి ఆవాహన చేసి పూజించుట
4. కుండము : అగ్నిని మంత్రపూతము చేసి ప్రజ్వలింపజేసి ఆహుతులను అర్పించుట.

విగ్రహారాధన : 

ప్రతిమలన్నీ ప్రాణరూపుడైన ఈశ్వరుని ప్రతీకలు. ఋషులు వారి ధ్యానములో దర్శనము పొందిన రూపములన్నింటినీ విగ్రహముల రూపములలో స్థాపన చేసిసాధారణ భక్తులు వాటిమీద శ్రద్ధనిష్ఠలతో ఆకర్షణ పూర్వకముగా పూజలు చేయవలెనని నిర్దేశించినవి. సాకార పూజ చేయుచూ చేయుచూ పోగా ఈశ్వరుని మీద భక్తిశ్రద్ధలు పెరిగి సమయము ఆసన్నమైనప్పుడు ఆత్మ సాధనలోకి మారునని ఋషుల సంకల్పము.


పుణ్య క్షేత్రములు :

1. స్వయం వ్యక్తములు : భగవంతుడు స్వయంగా వెలసినవి.
ఉదా : తిరుమలఅహోబిలమువేదాద్రిజంబుకేశ్వరుడు

2. దివ్య క్షేత్రములు దేవతలచే ప్రతిష్ఠింపబడినవి. ఉదా : శ్రీకూర్మముమధురాంతకము

3. ఆర్షములు : ఋషి ప్రతిష్ఠితములు. ఉదా : ద్వారకా తిరుమలశ్రీశైలముమంగళగిరి

4. సైద్ధ్యములు : సిద్ధులచే ప్రతిష్ఠింపబడినవి. ఉదా : శ్రీరంగముకాంచీపురముచిదంబరము

5. ప్రాకృతములు : పూర్వీకులచే ప్రతిష్ఠింపబడినవి. ఉదా : శ్రీకాళహస్తిసింహాచలము

6. నవీనములు : ఇటీవల మానవులచే క్రొత్తగా నిర్మింపబడుచున్నవి.
ఉదా : షిరిడీ సాయినాధ దేవాలయములు

సాధకునకు ఆలంబనలు : 
విగ్రహములను ప్రతీకలుగాఓంకారాదులనుస్తోత్రములను వాచకముగా పెద్దలచే ఏర్పాటు చేయబడినవి. ఇవి మనో పరిధిలోని సాధనలు.

భక్తి సాధనలు : 
పూజలుస్తోత్రములుజపముతీర్థాటనముపారాయణభజనలువ్రతములుదాన ధర్మములుసేవదీక్షయజ్ఞములుక్రతువులుస్వాధ్యాయముపురాణ శ్రవణముభాగవత రామాయణ గ్రంథ పఠనముతపస్సుసాధు దర్శనముసత్సంగము మొదలగు సత్కర్మలు.

భగవంతుని పొందుటకు సాధన : 
ప్రప్రథమముగా భగవంతుడున్నాడనిఅనుగ్రహించునని విశ్వాసముండవలెను. విచారణచేత ఆ విశ్వాసమును బలపరచుకొని ఆయనను చేరవలెననే తపన కలుగవలెను. ఆ తపన భక్తిగా మారవలెను. భక్తివలన శ్రద్ధ కలుగవలెను. విశ్వాసముభక్తిశ్రద్ధ ఈ మూడింటి వలన వినయము వచ్చును. ఆ వినయమే అహంకార నాశనమునకు దారి తీయును. అహంకారము నశించగానే భగవదనుభూతి కలుగును. అప్పుడు ఉదయించే జ్ఞానము వలన తానే భగవంతుడై యుండును.

అనన్య భక్తి : 
అనేకత్వములో భగవంతుని ఏకత్వము నెరుగుట. అన్యములేని పరమాత్మ సర్వదా సర్వత్రా ప్రకాశించుచున్నాడని నిశ్చయ జ్ఞానము కలుగుట. భ్రూమధ్యమందు గానిబ్రహ్మరంధ్ర పర్యంతము లక్ష్యముంచిఆ భగవంతుని తదేక నిష్ఠతో ధ్యానించుట. జీవసాక్షియైన భగవంతుని తెలుసుకునే చరమ దశయే అనన్య భక్తి.

ముఖ్య భక్తి : 
శాంత రూపముముఖ్య రూపముభక్తునిలోనే కేవలమైన ఆంతరిక అనుభూతి. వీరు తీర్థస్నానములకు పవిత్రతను కలిగించెదరు. సర్వశాస్త్రములకు ప్రమాణమును కలిగించెదరు. సకల కర్మలను పావనము చేయుదురు. వారి తపో మహిమచేత తీర్థములకుక్షేత్రములకు పవిత్రత కలుగును. అవి భక్తుల పాపములను హరించును. అందువలన భక్తులు క్షేత్ర తీర్థ మహిమలనువాటికి కారణమైన ఋషుల చరిత్రను తెలుసుకొని వారి భక్తిని వృద్ధి చేసుకొనవలెను. తీర్థయాత్రలు వినోదయాత్రలు కాకూడదు.

పరాభక్తి లక్షణములు :

1. పరప్రేమ స్వరూపముమనస్సు ద్రవీభూతమై ప్రేమాకారమగుట
2. అమృత స్వరూపముతనలో తాను రమించుట
3. పరమ తృప్తిపరమశాంతిపరమానందము
4. విషయాసక్తి లేనిదిఏదీ కోరనిది
5. భక్తితో మనస్సు సవికల్పమై యుండుటఏకాంత భక్తి రూపము
6. సర్వమును భగవత్‌ లీలా విలాసమనే దృష్టి కలుగుట.
7. తనలో భగవంతుడు ప్రతీతి అగుటభగవత్సాక్షాత్కారము
8. లౌకిక వేద విహిత వ్యాపారములు నిరోధించబడుట
9. సకల వ్యాపారములు భగవత్‌ కైంకర్యమగుటభగవద్వియోగ భయము
10. భక్తి ఇంద్రియములకు సోకికర్తృత్వరహితమగుటభగవత్‌ ఉన్మత్తత
11. అనాది కర్మలు నశించుటలౌకికమైన రాగాదులు లేకుండుట
12. తన్మయతమైమరపుఆర్ధ్రత చెందిన హృదయము
13. భగవద్భక్తిలో తెంపునువియోగమును భరించలేకుండుట
14. సాలోక్యాది ముక్తులు మొదలగునవి పరాభక్తి లక్షణములనబడును.

శ్రు||  భక్త్యావినా బ్రహ్మజ్ఞానం క దాపి నజాయతే |
                                               మహానారాయణోపనిషత్‌

తా||    భక్తి లేనిచో బ్రహ్మ జ్ఞానము ఎన్నటికీ లభించదు.

శ్లో||  దేహ బుద్ధ్యా-స్తి దాసో-హం జీవ బుద్ధ్యాత్వ దంశకః
       ఆత్మ బుద్ధ్యా  త్వమే వాహమితి మే నిశ్చితామతిః
                                                    - శ్రీ సీతారామాంజనేయ సంవాదము

తా||    దేహాత్మాభిమానమున్నప్పుడు నేను నీకు దాసుడను. జీవాత్మాభిమాన మున్నప్పుడు నీలోని అంశమగుదును. ఈ రెండభిమానములు వదలినప్పుడు ''కూటస్థుడే నేను'' అని నిశ్చయమై మనకిరువురకును భేదమే లేదు. ఈ విధముగా మీ అనుగ్రహము వలన నాయందు నిశ్చయమైనది.


                                                                - శ్రీ ఆంజనేయులు శ్రీరామునకు చెప్పినది.