యజ్ఞము

14. యజ్ఞము

శ్లో||  శ్రేయాన్ద్రవ్య మయాద్యజ్ఞాత్‌ జ్ఞానయజ్ఞః పరంతప |
       సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ||

తా|| నేయితిలలవంటి ద్రవ్యములతో చేసే యజ్ఞముకంటె జ్ఞాన యజ్ఞము శ్రేష్ఠమైనది. అది సకల కర్మలను దహించివేసిజ్ఞానమును ప్రతిష్ఠించును.

యజ్ఞము : 
పరమాత్మ అయిన నేను యజ్ఞ పురుషుడనుయజ్ఞ కర్తనుయజ్ఞ ఫలస్వరూపుడనుయజ్ఞ స్వరూపుడను అని త్రిపుటిని ఏకీకృతము చేయుట.

హోమము : వైదిక పద్ధతిగా అగ్ని కార్యములుఅగ్ని ఉపాసనలు చేయుట.

జ్ఞాన యజ్ఞము :

1. ఆత్మను సర్వే సర్వత్రా అర్థము చేసుకొని ఆస్వాదించుట.
2. ద్రష్టయే ఆత్మను దృశ్యరూప జగత్తుగా సంకల్పించుకొని వినోదించుచున్నాడని అనుకొనుట.
3. ఈ ద్రష్ట దృశ్యములను అఖండాత్మ స్వరూపముగానుఅఖండాత్మ తత్త్వముగానుఅదియే శివతత్త్వమని గ్రహించే అభ్యాసము. ఈ మూడూ కలసినది జ్ఞాన యజ్ఞమనబడును.

ద్వాదశ యజ్ఞములు :
1. దైవ యజ్ఞము 2. బ్రహ్మ యజ్ఞము 3. ఇంద్రియ సంయమ యజ్ఞము 4. విషయ నిరోధ యజ్ఞము 5. మనో నిగ్రహ యజ్ఞము 6. ద్రవ్య యజ్ఞము 7. తపో యజ్ఞము 8. యోగ యజ్ఞము 9. స్వాధ్యాయ యజ్ఞము 10. ప్రాణాయామ యజ్ఞము 11. ఆహార నియమ యజ్ఞము 12. జ్ఞాన యజ్ఞము

పంచ యజ్ఞములు :

1.బ్రహ్మ యజ్ఞము : 
అధ్యయనముప్రణవాది తారక మంత్రముల జపముఉపనిషత్‌ భాగవతాదుల పారాయణ మొదలగునవి.

2. పితృ యజ్ఞము : పిండ ప్రదానముఅన్నదానముమాతా పితలకు పూజ.

3. దైవ యజ్ఞము : వైశ్వ దేవాది అగ్ని హోత్రము. అన్నాది నైవేద్యముల చేత దేవతలను ఆరాధించుట.

4.భూత యజ్ఞము : గోవులుకుక్కలుపిల్లులుపక్షులుచీమలుఉడతలు మొదలగు వాటికి ఆహారమును ఇచ్చుట.

5. నర యజ్ఞము : 
బ్రహ్మచారులువానప్రస్థులుసన్న్యాసులు మొదలగు సాధు పురుషులకు అన్న వస్త్రాదులనిచ్చి పూజించుట. రోగులుపేదలుఅనాధలువృద్ధులు మొదలగు నిస్సహాయులకు పాత్రోచితముగా సహాయము చేయుట.

1. ద్రవ్య యజ్ఞము : కొన్ని పదార్థములను ఉపయోగించి చేసే యజ్ఞము.

2. తపో యజ్ఞము : 
తపస్సు ద్వారామనో నిగ్రహము ద్వారాసర్వేంద్రియ భోగములపట్ల విరాగము ద్వారాసర్వసంగ పరిత్యాగము ద్వారా సర్వభోగములను అంతరాత్మయందు వ్రేల్చిఏ భేదము లేనివాడై యుండుట. అతడే యజ్ఞ పురుషుడుపరమాత్మ. జ్ఞానమే అగ్నిగాఇంద్రియములను సమిధలుగాఇంద్రియార్థములను ఆజ్యముగాప్రాణమును హవిస్సుగా చేయునదే తపో యజ్ఞము.

3. ప్రాణ యజ్ఞము : 
ప్రాణమును అపానమందునుఅపానమును ప్రాణమందును వ్రేల్చి హవిస్సుగా చేయునది.

4. యోగ యజ్ఞము : 
ప్రాణాపానములను సమానము చేసిప్రాణాయామ స్వరూపమైన ప్రాణయజ్ఞము ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసల రెంటిని పూర్తిగా సమము చేసిముక్తస్థితిని పొందుట.

5. స్వాధ్యాయ యజ్ఞము : 
వాగ్రూపములో వేదమంత్రముల ద్వారా చేయబడే యజ్ఞము. పై దవడక్రింది దవడల మధ్య నాలుకతో వాగ్రూపముగా జరిగే కార్యమే స్వాధ్యాయ యజ్ఞం.

సంవత్సర యజ్ఞం : 
సంవత్సర కాలములో సూర్యుడు చక్రాకారముగా నక్షత్ర మండలమును అనగా రాశి చక్రమును చుట్టి తిరిగే దానికి సంవత్సర యజ్ఞము అని పేరు. కాల చక్రమే కాల పురుషుడు. కాల పురుషుని దేహమే రాశి చక్రములో కదలుచున్నట్లు అనిపించే నక్షత్రములు.
              12 మాసముల కాలము తిరిగిమేషరాశిలోనికి ప్రవేశించే సరికిఅనగా ఒక సంవత్సర కాలగమనమును ఒక ఆవృతిగా లెక్కించినది సంవత్సర యజ్ఞము అందురు. బ్రహ్మాండములో జరిగే 12 రాశులలో ఆవృత్తి యగుట సంవత్సర యజ్ఞము పిండాండములో మూలాధారమునుండి ఆజ్ఞావరకు ఉచ్ఛ్వాసలోనుతిరిగి ఆజ్ఞనుండి మూలాధారము వరకు నిశ్వాసలోను మొత్తము 2X6=12 చక్రములలో ఆవృతమగుట మానవకుండలినీలో జరిగే సంవత్సర యజ్ఞము. బ్రాహ్మణ వర్ణము వారికి జ్ఞానయజ్ఞమువైశ్య వర్ణము వారికి ద్రవ్య యజ్ఞముక్షత్రియ వర్ణము వారికి పశుబలి యజ్ఞము నిర్దేశించబడినవి.

యజ్ఞమనగా : 
1. దైవారాధన 2. ఐక్యత 3. దానము.
              యజ్ఞమనగా ఉపాదాన నిమిత్త కారణలు లేకనే జరిగే కార్యములు. ఈశ్వర కార్యములు యజ్ఞము. ఈశ్వరుడే యజ్ఞ పురుషుడు. సాధకులలో కర్తృత్వ భోక్తృత్వములు వదలి చేయబడే కర్మలు కర్మల క్రిందికి రావు. అది యజ్ఞమగును.

యజ్ఞము చేయుటకు ముఖ్యమైనవారు :

1. హోత : యజ్ఞమునకు కర్తయజ్ఞమునకు ఆహ్వానించువాడు.

2. బ్రహ్మ : 
పండితుడై యుండి, 3 వేదములు తెలిసినవాడై యుండినిర్వహణపర్యవేక్షణలకు బాధ్యుడైనవాడు. దోషములను గుర్తించిసరిదిద్దేవాడై యుండవలెను.

3. ఉద్గాత : సామవేదమును వల్లెవేయుచూ మంత్రములను ఉచ్ఛరించేవాడు.

4. అధ్వర్యుడు : 
నిర్ధిష్ట ప్రమాణముల మేరకు యజ్ఞ శాలను నిర్మించుటకావలసిన సంబారములను సిద్ధము చేయుటఅనగా పాత్రలుసమిధలువ్రేల్చవలసిన ఇతర ద్రవ్యములునీరుయజ్ఞ పశువు మొదలగునవి. వీటికి బాధ్యుడు.

5. సదస్యులు : 
యజ్ఞమును చూచుటకు వచ్చినవారు అని అర్థము. అయినను నిర్వహణపర్యవేక్షణలో సహాయమునందించుచుగమనించుచుదోషములు గుర్తించిసవరింపజేయుట వారి విధి.

యజ్ఞ కాండకు సంబంధించిన సూత్రములు  :
1. హోత్రు గురించి అశ్వలాయనసాంఖ్యాయన సూత్రములలో చెప్పబడినది.
2. అధ్వర్యుని గురించి బౌద్ధాయన సూత్రములో చెప్పబడినది.
3. ఔద్గాత్రు గురించి లాటాయనవ్రీహ్యాయన సూత్రములలో చెప్పబడినది.

ఆహుతులు : 
1. శ్రద్ధ 2. సోమరసము 3. వృష్టి రూపము అనగా వ్రీహియవాది స్థావర ఉపాధులలో చేరినది. 4. అన్నము అనే రూపము 5. రేతో రూపము.
              జీవుడు శరీర పతనానంతరము 1. శ్రద్ధగా మారి 2. సోమ రసములో ఆహుతి యగును. ఆ సోమరసము మేఘమందు జేరి 3. వృష్టి రూపమై వ్రీహి యవాదుల స్థావర ఉపాధులందు జేరును. ప్రతి దశలోను పూర్వమైనది ఆహుతియై క్రొత్త రూపమును సంతరించుకొనును. ఉపాధులలో ఆహుతియైన వృష్టిరూపము. 4. అన్న రసమగును. శుక్ల శోణితములలో ఆహుతియై రేతస్సుగా మారును. రేతస్సు ఆహుతియై పిండరూపమగును. ఇదే ఆహుతుల క్రమము.

చాతుర్హోత్రము : 
1. కరణము 2. కర్మ 3. కర్త 4. మోక్షము. ఈ నాలుగు హుతమైతే ఏది అన్ని కాలములలో ఉంటూ ఉన్నదో అదే బ్రహ్మ సాక్షాత్కారము.

కరణము అనగా పంచ జ్ఞానేంద్రియములుమనస్సుబుద్ధి అనే ఏడు కర్మ హేతువులు.
కర్త అంటే కరణము ద్వారా గ్రహించుచుఆ విషయములను అనుభవించువాడు.
కర్మ అంటే ఏడు ఇంద్రియములను ఉపయోగించి విషయములను ఇష్టా యిష్టములుగా ఉంచుకొనుటమోక్షము అనగా కరణముకర్తకర్మ వర్గములు గుణవంతములైతమ గుణములను తామే మ్రింగివేయు చున్నవనియుఅయినను తాను వాటితో సంగత్వము చెందక నిర్గుణుడినిఅనంతుడిని అని భావించుట. ఇది పరోక్షము. అపరోక్షము కొఱకు మోక్షమును కూడా హుతము చేయవలెను.

యజ్ఞ సంబంధమైన పదములు :

యూప స్థంభము : బలి పశువును కట్టి ఉంచుటకు పాతిన స్థంభము.

చత్వాల దేశము : బలి పశువును బలిగా అర్పించు స్థలము.

శాలి వాహనుడి పని : 
శాలి వాహనుడనగా కుమ్మరి. ఇతడు బలి పశువు యొక్క నవరంధ్రములను మూసిఅది ప్రాణము విడిచేదాకా ఉండితాంబూలము పుచ్చుకొని వెళ్ళుట.

అధ్వర్యుని పని : ఆ విధముగా చచ్చిన పశువు పొట్ట కోసి అందులో నున్న వపను బయటికి తీయుట.

వప : క్రొవ్వుతో కూడిన మాంసపు తిత్తి.

ఇడా పాత్ర : 
పశువు యొక్క గుండె మొదలైన ఉత్తమ భాగములను తీసి ముక్కలుగా కోసి ఒక బానలో ఉంచెదరు. ఆ బానను ఇడాపాత్ర అందురు.

పురోడాశము : 
బలి పశువు యొక్క ముఖ్య భాగములను ముక్కలు కోసి కొన్నిటిని అగ్నికి సమర్పించగా మిగిలిన భాగమును పురోడాశము అంటారు. యజ్ఞకర్తభార్యమరో ఆరుగురు విప్రులు ఈ పురోడాశమును మినప గింజ పరిమాణములో కొద్దిగా భక్షించెదరు.

సోమరసము : 
సోమ తీగను దంచిపెద్ద ముత్తైదువలు రసమును తీయుదురు. దీనిని సోమరసము అందురు. యజ్ఞ కర్తభార్య ఈ సోమరసమును సేవించెదరు.

అవబృధ స్నానము : 
యాగదీక్ష అన్ని విధములుగా సంపూర్ణమైన పిదప సోమయాజి దంపతులు చేసే స్నానమును అవబృధ స్నానము అందురు. దీనితో యజ్ఞము పరిసమాప్తియైనట్లు లెక్క.

కటిక సోమయాజి : 
బలిమేకకు ఎన్ని వెంట్రుకలున్నవో అంతమందికి సకల కులముల వారికి అన్న సంతర్పణ చేయవలెను. కొంతమందికి మాత్రమే చేసి ఊరకుండే యజ్ఞకర్తను కటిక సోమయాజి అందురు.

అశ్వమేధ యాగము (అంతర్యాగము) : 
అశ్వమనగా పరుగెత్తేది. కాలముమనస్సు కూడా పరుగెత్తేవే. యాగాశ్వము భూమండలమంతా తిరిగి యజ్ఞ వాటికకు చేరును. గోళములు తిరుగుచుండును. దేశమువిశ్వము కూడా అశ్వమే. జీవుడు లోకాంతరములుజన్మాంతరములు తిరుగుచుండును. జీవుడు కూడా అశ్వమే. ఇక కదలనిది ఆత్మ మాత్రమే. అది బ్రహ్మ మాత్రమే.
              కదిలే వాటిని భేదించవలెనువధించవలెను. అప్పుడు కదలని ఆత్మయే స్థిరమైసిద్ధమై యుండును. మేధ్యము అనగా పరిశుద్ధమైనదిపవిత్రమైనది. మేధ అనగా వధించుటసంగమించుట అని కూడా అర్థమున్నది. దేశముకాలమువిశ్వముజీవుడు అన్నీ అశ్వమే అయినప్పుడు అశ్వమేధము అనగా వాటినన్నిటినీ పవిత్రపరచివధించవలెను అని అర్థము. కదలని బ్రహ్మతో సంగమించికదిలేవాటిని లయము చేయవలెను. లయము అనగా లేనివి లేకుండా పోవుటయే.
              అందువలన అశ్వమేధము అనగా జీవుడు ఆత్మతో సంగత్వము చెందితాను దేశకాలాదులతో సహా లేకుండా పోవలెను. ఇదే యజ్ఞమంటే. ఇక అశ్వమేధ యాగమనగా జీవుడు ఆత్మానుసంధానమై ముక్తి పొందుట.
         నూరు అశ్వమేధములు చేస్తే ఇంద్రపదవి రావటమనగా నూరేళ్ళు జీవించిన జీవితమును యజ్ఞమువలె సాధన చేయగా ఇంద్రుడు అందుకొన వలసిన పదవిని జీవుడు పొందును. అనగా ముక్తుడగును. అశ్వ రక్షకుడుగా వెళ్ళేవాడు జీవుడు. అశ్వమనగా మనస్సు. అశ్వమును వధించి హోమములో వేసి ఆహుతి చేయుట అనగా జీవోపాధి వాసనలనుప్రపంచ వాసనలను పూర్ణాహుతి చేయుట. తుదకు చలించే జీవుడనే ఎరుక లయమైశాశ్వతమైన అచల పరిపూర్ణము శేషించినదేదో అది స్వతః సిద్ధమై యున్నది.

శ్లో||  యజ్ఞ దానతపః కర్మత్యాజం కార్యమేవ తత్‌ |
              యజ్ఞోదానంతపశ్చైవ పావనాని మనీషిణామ్‌ ||

శ్లో||  ఏతన్యాపితు కర్మాణి సంగం త్యక్త్వౌ ఫలానిచ |
       కర్తవ్యా నీతియే పార్థ నిశ్చితం ముతముత్తమమ్‌ ||

తా||    యజ్ఞ దానతపశ్చర్యాది కర్మలను త్యజించరాదు. వాటిని అనుష్ఠించిన బుద్ధిమంతులు పవిత్రులగుదురు. కాని వాటిని ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలుగా ఆచరించవలెను.

              యజ్ఞవిధాయక యజ్ఞ నియామక యజ్ఞ ఫలాశ్రయ యజ్ఞకరా |
       యజ్ఞ ఫలావన యజ్ఞ ఫలాశన |  యజ్ఞ ఫలప్రద యజ్ఞదరా |
       యజ్ఞవిధి ప్రియా యజ్ఞ సమర్పిత యజ్ఞ సుసాధన యజ్ఞపతీ |
       యజ్ఞ శరీరక యజ్ఞ రహస్యక |  యజ్ఞ నారాయణ యజ్ఞమయా |



                                                                - శ్రీ సీతారామాంజనేయ సంవాదము