పీఠిక

పీఠిక

ఉపనిషత్తులు, శాస్త్రములన్నీ సంస్కృత భాషలో నున్నవి. కాలానుగుణ్యముగా అనేకమంది మహానుభావులు తెలుగులోనికి అనువాదము చేయుచుండిరి. సరియైన తెలుగు పదముల అర్థము, గ్రాంథిక రచన చాలామందికి వారి గ్రహింపులో భేదములనేర్పరచుచున్నవి. కొన్ని సంస్కృత పదములు అలాగే తెలుగు భాషలోనికి తీసుకొనుటయు జరిగినది. పఠన శ్రవణములు చేయువారి అవగాహనలో, భేదములు, లోపములు కలుగుచున్నవి.

         అందువలన కొన్ని శాస్త్ర పదములను ఆయా గ్రంథములు చదువుచున్నప్పుడు నోట్సుగా వ్రాసి, వివరణను కూడా వ్రాసుకొనుచుంటిని. స్వాధ్యాయము, సత్సంగములో చర్చ, స్వానుభవముల కొఱకు ఈ సేకరణ, వివరణ నమోదైనవి. కొందరు సత్సంగ సభ్యులు, ఆ నోట్సును పుస్తక రూపముగా నందించవలెనని కోరగా, పెద్దలు, గురువులు నన్ను ప్రోత్సహించి, ప్రేరణనివ్వగా పుస్తక ప్రచురణకు ఉపక్రమించడమైనది. నా వివరణలోని అవగాహనా లోపములు దొరలిన యెడల క్షంతవ్యుడను.

         శాస్త్ర పదముల నిర్వచనము, అర్థములు బాహ్యర్థముగాను, అంతరార్థముగాను, దేహళీదత్త దీప న్యాయముగా నుండును. అందువలన అద్వైత నిర్ణయముగానే విశదీకరించుటకు ప్రయత్నించితిని. ఇవి సాధకులకును, బ్రహ్మ జ్ఞానాభ్యాసకులకు కరదీపిక, లేక reference book  గా వినియోగపబడును. జిజ్ఞాసువులు చక్కగా దాచుకొని, అవసరమైనప్పుడు పరిశీలించుచు తరించెదరని ఆశించడమైనది.


చల్లపల్లి                                                                                         బుధజన విధేయుడు

ది. 25-12-2016                                                                               విజ్ఞాన స్వరూప్