తపస్సు

13. తపస్సు

తపస్సు : 
బ్రహ్మయందు మనః సంకల్పమును తపస్సు అందురు. తపనయే తపస్సు. పరమాత్మ సన్నిధికి మనోబుద్ధులను జేర్చి అనుసంధాన మొనర్చు కొనవలెననెడి తపనయే తపస్సు.

తపస్సు యొక్క లక్షణములు : 
ఓర్పుఅహింససత్యముసమభావముఇంద్రియ జయముక్రోధమును దూరీకరించి యుండుటత్యాగశీలత మొదలగునవి. ఇంద్రియములను మనస్సును ఒకే ధర్మముగా పాటించుట. ప్రసాదగుణముప్రత్యాహారముధైర్యము - ఈ మూడు కలసిన లక్షణము. కోరికలను త్యజించుచుండుట.

త్రివిధ తపస్సు :

1. ఉత్తమ తపస్సు : 
ఆత్మానాత్మ వివేకముచేత మనస్సును ప్రత్యగాత్మయందు విలీనము చేయుట. ఇది విజ్ఞాన తపస్సు.

2. మధ్యమ తపస్సు : ధ్యాన ధారణాదులచేత మనస్సును నిలువరించిసమాధిలో నుంచుట.

3. కనిష్ఠ తపస్సు : 
కేవలము కృచ్ఛంద్రాయణాదుల చేతనుఉపవాసము చేతను దేహేంద్రియములను కృశింపజేయుట.

అంతః తపస్సు : 
సృష్టికి మూలకారణమైన బ్రహ్మయే నామరూపాత్మకమైన జగత్తు - అట్టి జగత్తును తనలోనే కల్పించుకొని అన్నీ తానైనవాడే  బ్రహ్మము. ఇదంతా ఆ బ్రహ్మము యొక్క అంతః తపస్సు వలన జరిగినది. సాధకుడు ఈ కల్పిత జగద్రూపమును విడచితిరిగి ఆ ఒక్కటైన నిర్వికల్ప బ్రహ్మముగా ఉండిపోవుటయే సాధకుని యొక్క అంతః తపస్సు.

తపోజ్వాల : 
ప్రాణాయామ సాధనలో వాయువు యొక్క తీవ్రమైన గతాగతిలో విద్యుత్‌ వంటి శక్తి పుట్టిఆ వాయువునుండి వేరైదేహమునంతటను వ్యాపించును. అది క్రిందికి మూలాధారము వరకు వెళ్ళిమరల జననాంగ మూత్ర ద్వారములో ప్రవేశించిసూక్ష్మ ద్వారము ద్వారా సుషుమ్నములోనికి పోయిబ్రహ్మ రంధ్రము వరకు వ్యాపించును. తదుపరి దేహమునుండి వెలుపలికి వ్యాపకమైలోక లోకాంతరములను చేరును. దీనినే తపోజ్వాల అందురు.              దేవతలగూర్చి తపించినప్పుడు ఆయా దేవతలు ప్రత్యక్షమై వరముల నిచ్చెదరు. కాని జ్ఞానము మోక్షము లభించవు. అందువలన తాపసులకంటె యోగులు శ్రేష్ఠులు. తాపసులు కూడా ముముక్షువులై, వరములను నిరాకరించి, స్వరూప సాక్షాత్కారమునకు ప్రయత్నించవలెను.